కొన్ని రోజుల క్రితం మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొన్నాను. మగవాళ్ళు ఆడవారికి మద్దతుగా ఎలా నిలబడాలి అనే విషయం మీద చర్చిస్తున్నప్పుడు, మనం అర్జెంట్ గా సమాజం మొత్తం మారాలని కోరుకోవడం మంచిదే కానీ, ఇవన్నీ ఒక్కసారిగా మారవు. చిన్న చిన్న మార్పులతో ఇది సాధ్యం అన్నాను. ఉదాహరణకి, మనింట్లో మనం తిన్న ప్లేట్ మనమే కడుక్కోవడం అనే చిన్న విషయం లో మనం మారితే మార్పుకి అది తొలి మెట్టు అని చెప్పాను. ఇదేమంత పెద్ద విషయం అనిపించవచ్చు. కానీ ఇది చేసి చూడండి చాలా విషయాలకు ఇది నాంది అవుతుంది. మగవారు భోజనం చేసిన ప్లేటును తామే కడుక్కోవడం అనేది పైకి ఒక చిన్న శారీరక శ్రమలా అనిపించినా, దీని వెనుక ఒక బలమైన రాజకీయ కోణం దాగి ఉంది. దశాబ్దాలుగా మన సమాజంలో పితృస్వామ్య వ్యవస్థ నిర్మించిన ఒకానొక అలిఖిత నియమం ఏమిటంటే, ఇంటి పనులు కేవలం ఆడవారి బాధ్యత మాత్రమే అని. ఒక చిన్న మార్పు పెద్ద చర్చకు ఎలా దారి తీస్తుందంటే, ఒక తండ్రి తన ప్లేటును తనే కడుక్కోవడం చూసినప్పుడు, ఆ ఇంట్లోని పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. అక్కడ లింగ వివక్షకు తావుండదు. పనులు అనేవి వ్యక్తుల అవసరాలను బట్టి ఉండాలి తప్ప, ఆడ-మగ అనే విభజనతో కాదని వారు గ్రహిస్తారు. ఇది కేవలం ప్లేటు కడగడంతో ఆగిపోదు. రేపు వంట గదిలో సహాయం చేయడం, పిల్లల బాధ్యతలను పంచుకోవడం వంటి అంశాల వైపు మగవారిని నడిపిస్తుంది. ఫలితంగా ఇంటి పని అనేది కేవలం స్త్రీల మీద పడే భారం కాకుండా, అందరూ కలిసి పంచుకునే బాధ్యతగా మారుతుంది. ఈ చిన్న అడుగు ద్వారానే మనం వ్యవస్థీకృతమైన అసమానతలను ప్రశ్నించగలం. స్త్రీలకు కేటాయించిన పనుల్లో పురుషులు భాగం పంచుకున్నప్పుడే, నిజమైన సాధికారతకు, సమానత్వానికి పునాదులు పడతాయి.
Neelira captures the quiet, everyday bravery of a family trying to celebrate a wedding while war looms outside. The story shows how people survive through small habits and shared memories rather than grand speeches. It is a deeply human look at how conflict changes everyone it touches.
The movie is receiving a fantastic reception following its early screenings in Hyderabad. You can catch it in theaters across Hyderabad and Bangalore with English subtitles, made possible by the support of Rana and Spirit Media. Do not miss this experience.
#neelira
హాలీవుడ్ లో వచ్చిన చాలా సినిమాలకు ఇలా స్క్రిప్ట్ టు స్క్రీన్ వీడియోస్ చాలా చూసాను. కానీ ఒక తెలుగు సినిమాకి ఇలా స్క్రిప్ట్ టు స్క్రీన్ వీడియో చేయడం బహుశా ఇదే మొదటి సారేమో.
గౌతం గారు తన స్క్రిప్ట్ ఎంత పకడ్బందీగా రాసుకున్నారో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. BGM ఎక్కడ రావాలి, పాత్రలు ఎలా కదలాలి అనే ప్రతి విషయాన్ని తన స్క్రిప్ట్ లో వివరంగా రాసుకున్నారు కాబట్టే జెర్సీ అనే సినిమా ఒక క్లాసిక్ అయింది.
ఇలాంటి స్క్రీన్ ప్లే ఒక పుస్తకంగా తీసుకురావడం నిజంగా మాకు గర్వంగా ఉంది.
#Jersey #JerseyScreenplay
Thank you @nameisnani garu for the time and the insightful conversation yesterday. It was an honor to present him with his copy of the #Jersey screenplay book. His belief in screenplay publishing as a vital tool for budding writers and a way to preserve the craft of screenwriting is the best kind of encouragement.
We are going to get two more screenplays in the coming months.
You can get your copy of this book from Amazon.
సినిమాలు తీసే వాళ్లే కాదు, సినిమా చూసే ప్రతీ ప్రేక్షకుడూ చదవాల్సిన పుస్తకం సుజాత స్క్రీన్‍ప్లే. తెలుగు అనువాదం డార్లింగ్ స్వామి గారు.
ఇప్పుడే ఆర్డర్ చేసి చదవండి, ఈ అమెజాన్ లింక్‍పై క్లిక్ చేసి https://amzn.in/d/d6sp9AO
పుస్తకం కోసం DM చేయండి.
#screenplaytelugubook #acreenplay #sujathabook #rojamovie #bharateeyidumovie #neninthemovie #raviteja #purijagannadh #telugubook #moviebooks #telugucinema
Video credits :
@idreammedia@neninthemovieteam
#నీరుణంతీరేదిఎట్ల
#రచ్చరవి
మాతృ దినోత్సవం సందర్భంగా నిన్న సాయంత్రం ప్రసాద్ ల్యాబ్ లో ప్రముఖ సినీ నటుడు రచ్చ రవి రాసిన పుస్తకం 'నీ రుణం తీరేది ఎట్ల?' విడుదల అయింది. కార్యక్రమం ఆద్యంతం చాలా ఆసక్తిగా సాగింది. అల్లం నారాయణ సర్, మౌనశ్రీ మల్లిక్ అన్న, పెద్దింటి అశోక్ కుమార్ అన్న, పసునూరి రవీందర్ అన్న, తనికెళ్ళ భరణి సర్, అన్నపూర్ణమ్మ, టీవీ5 మూర్తి.., ఇలా వచ్చిన అతిథులందరూ చాలా బాగా మాట్లాడారు. సభ నవ్వులు పూసింది. చివరగా రచయిత రచ్చ రవి ప్రసంగం ఆకట్టుకుంది. ఎంతోమంది పిలవగానే వచ్చి సభను విజయవంతం చేశారు. యూట్యూబ్ లింక్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నా.
#అన్వీక్షికిపబ్లిషర్స్
#అనౌన్జా
మనం చూస్తున్న ఈ ప్రపంచంలో మనకు తెలియని ప్రపంచం ఎంతో ఉందని చూపించిన పుస్తకం. ఇందులోని అక్షరాక్షరాన్ని అనుభూతిస్తే ఎవరి పాఠం వాళ్లు చదువుకున్నట్టు... మున్ముందు గుణపాఠానికి, పశ్చాత్తాపానికి గురికాకుండా ఒక అద్భుతమైన, లోతైన బతుకు పాఠాన్ని, జీవిత సారాన్ని తెలుసుకున్నట్టు. మన జ్ఞాపకాలను మనకు గుర్తు చేస్తూ... మన తరాలకు పది కాలాలు గుర్తుండి పోయే పుస్తకం. 'అరె! నాలో ప్రేమ తగ్గిందా? నేనే ప్రేమకు దూరమైతాన్ననా?' అనుకొని ఫోన్ పక్కన పారేసి బంధాలను గుండెలకు అలుముకొని, బంధుత్వాలను బలోపేతం చేసి, కొండంత ప్రేమను గుమ్మరించే అనురాగాల పుస్తకం... మొత్తంగా మనుషులను మనసు నిండుగా ప్రేమించే పుస్తకం... నీ రుణం తీరేది ఎట్ల?
Congratulations
@Racharavi369
Order you copy now at Amazon.
DM for link
#నీరుణంతీరేదిఎట్ల?
సినీ నటుడు @meracharavi భాయ్ తీసుకొస్తున్న ఒక మంచి పుస్తకం. బంధాలు ఉంటాయి కానీ అనుబంధాలే కొనసాగింపులో దెబ్బ కొడుతుంటాయి. ఆ ఎరుకను కలిగించే కోణం ఈ పుస్తకం. అమ్మమ్మ అనేది మన బాల్యానికి గొప్ప ఎంటర్టైన్మెంట్ అడ్డా. సెలవులు రాగానే అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం పరిపాటి. ఆటలు, పాటలు, కథలు అబ్బో శానా ఉంటాయి. రవికి అమ్మమ్మతో చాలా జర్నీ ఉంది. అందుకే ఇట్లా అమ్మమ్మకు అక్షరాంజలి ఘటించి ఆ మహాతల్లి రుణం కొంత తీర్చుకున్నాడు.
ఈ పుస్తకం పనిలో నన్ను ఎంచుకున్నందుకు రవి భాయ్ కు శానా శానా ధన్యవాదాలు. విద్యాసాగర్ తో కలిసి పుస్తకం కోసం వర్క్ చేసిన ఆ రెండు నెలలు మరిచిపోలేనివి. కొన్నిసార్లు షూటింగ్ గ్యాపులో క్యారవాన్ లో కూర్చొని రాసిన రోజులు... ఎంత ఎంజాయ్ చేశామో చివరికి కన్నీళ్ళు కూడా పెట్టుకున్నాం. హరి, సూరజ్ భాయ్, సంతోష్ భాయ్ లు సహకారం మరిచిపోలేనిది. కుమార్ సర్ ముఖచిత్రం, వివేక్ గుడారు ఇల్లిస్ట్రేషన్స్ పుస్తకం స్థాయిని పెంచాయి.
అట్లా నాకు బాగా కనెక్ట్ అయిన పుస్తకం ఇది. ఎందుకంటే రవి లానే నేను కూడా అమ్మమ్మ దగ్గరే పెరిగాను. విచిత్రం ఏంటంటే నేను అమ్మమ్మను ఏరోజూ నానీ(అమ్మమ్మ) అని పిలవలేదు. దాదమ్మా(నానమ్మ) అనే అన్నాను. ఎందుకంటే మా మామ పిల్లలు దాదమ్మ అంటే మేమూ అలాగే పిలిచేవాళ్ళం.
అయితే అమ్మమ్మ అంతవరకే ఉంటుంది. ఆ తర్వాత ఎందుకో అమ్మమ్మ మటుమాయం అయిపోతుంది. జ్ఞాపకాలకే పరిమితం అయిపోతుంది? ఎన్నో చేసిన ఆమెకు మనం ఏం చెయ్యలేమా? ఇట్లా ఒక పుస్తకం రాయాలనే ఆలోచన రాదు. రవికి ఆ ఆలోచన రావడం, నేను కలవడం, ఇద్దరి నేపథ్యాలు దరిదాపు సిమిలర్ గా ఉండడం వల్ల నేనింకా బాగా కనెక్ట్ అయ్యాను.
అమ్మమ్మ మీద ఇంత మంచి పుస్తకం తేవడం రవి చేస్తున్న అద్భుతమైన పని అనొచ్చు. తన గుండెల్లో గూడు కట్టుకున్న అమ్మమ్మ మీది పాయిరాన్ని ఒలకబోసి పుస్తకం రాయడం చాలా సంతోషం. అన్వీక్షికి పబ్లిషర్స్ నుండి ఈ పుస్తకం రావడం నాకు మరింత ఆనందం కలిగించిన విషయం. ఎన్నో మంచి పుస్తకాలు తీసుకొచ్చిన వెంకట్ సిద్దారెడ్డి, మహి అన్నలు ఈ పుస్తకాన్ని తీసుకురావడం గొప్ప అచీవ్మెంట్.
మే 10, ఆదివారం సాయంత్రం 6:00 గంటలకు ప్రసాద్ ల్యాబ్ లో పుస్తకం రిలీజ్ అవుతోంది. చాలామంది పెద్దలు, ప్రముఖులు వస్తున్నారు. మీరూ రండి.
బుక్ కావాలనుకున్నవారు కింద అమెజాన్ లింకులోకి వెళ్ళండి.
https://www.amazon.in/dp/9348912240?ref=cm_sw_r_ffobk_cp_ud_dp_D89M5GCSZVK98SXJ7X34&ref_=cm_sw_r_ffobk_cp_ud_dp_D89M5GCSZVK98SXJ7X34&social_share=cm_sw_r_ffobk_cp_ud_dp_D89M5GCSZVK98SXJ7X34&bestFormat=true&fbclid=IwdGRjc
#నీరుణంతీరేదిఎట్ల?
#రచ్చరవి
#అన్వీక్షికిపబ్లిషర్స్
#అనౌన్జా
When a voice you’ve always heard on screen
now speaks through pages…it hits different.
Presenting "NEE RUNAM TEEREDI ETLA", the book by @meracharavi - raw, real, and straight from life.
📖 Book Launch: May 10, 2026
Published by @anvikshikipub
Thank you so much @vrsiddareddy for your support throughout.
We’re proud to come on board as the official promotional partner for this special journey.
Stay tuned - this is more than just a book.
👉 Follow @announza for exclusive updates & moments
రచ్చ రవి నటుడిగా మనందరికీ తెలుసు. కొన్ని నెలల క్రితం ఒక పుస్తకం గురించి మాట్లాడాలని వచ్చినప్పుడు, రవి రాసింది చదివి ఆశ్చర్యపోయాను.
ఇలాంటి పుస్తకం నేను ఇంతవరకు చదవలేదు. జన్మనిచ్చిన తల్లి తండ్రుల గురించి చాలామంది రాసిన పుస్తకాలు ఉండొచ్చు. కానీ అమ్మమ్మ గురించి నేను ఇంతవరకు ఎప్పుడూ ఒక పూర్తి పుస్తకమైతే చదవలేదు.
ఈ పుస్తకం చదువుతుంటే తెలియకుండా నా బాల్యంలోకి వెళ్ళిపోయాను. మన చిన్నతనంలో చాలామందికి సెలవుల్లో అమ్మమ్మ ఇంట్లోనే గడపడం సాధారణం. కానీ ఎందుకో పెద్దయ్యాక చిన్నగా అమ్మమ్మ వాళ్ళింటికి దూరమవుతాం మనం. రవి ఆ జ్ఞాపకాలను పదిలపరచడమే కాకుండా, ఆ అనుభవాలు తన జీవితాన్ని ఎలా మలిచాయో చెప్పుకుంటూ తన అమ్మమ్మను మనందరి మనసుల్లో ఒక జ్ఞాపకంగా పర్మనెంట్ గా ముద్రించేశాడు. ఆన్విక్షికి ద్వారా వందమంది దాకా కొత్త రచయితలను తెలుగు సాహిత్య లోకానికి పరిచయం చేసాం. ఇప్పుడు రచ్చ రవి కూడా మా సంస్థ ద్వారా రచయితగా పరిచయం కావడం ఆనందంగా ఉంది.
వచ్చే ఆదివారం, మే 10 మదర్స్ డే సందర్భంగా ఈ పుస్తకం అందరికి అందుబాటులోకి రానుంది.
మేము ఇప్పటివరకు ప్రచురించిన 250 పుస్తకాలతో మాకు ఎన్నో కొత్త కొత్త అనుభవాలున్నాయి. మాకు బాగా నచ్చిన కొన్ని పుస్తకాలు పాఠకులకు చేరడానికి ఒక్కోసారి చాలా సమయం పడుతుంది. ఇది ఫర్వాలేదు అనుకున్న పుస్తకం ఒక్కోసారి బెస్ట్ సెల్లర్ అవుతుంది. ప్రేమ లేదని ప్రేమించ రాదని పుస్తకం మా దగ్గరకు ప్రచురణకు వచ్చినప్పుడు, ఇది కొత్త జనరేషన్ కి బాగా నచ్చే పుస్తకం అనుకున్నాం. కానీ అది చేరాల్సిన పాఠకులకు చేరలేదేమో అని అనుమానంగా ఉన్నాం. అలాంటి సమయంలో ఈ మధ్యనే కొంతమంది చదివిన వాళ్ల అభిప్రాయం ప్రకారం టైం పట్టినా ఈ పుస్తకం వేరాల్సిన పాఠకులకు చేరి తీరుతుందనే నమ్మకం కలిగింది. ఈ మధ్యనే స్వప్న ప్రియ గారు, (నాలో ఉన్న ప్రేమ నవలా రచయిత) ఈ నవల చదివి ఇలా రాసారు. ప్రేమలేదని ప్రేమించరాదని - టైటిల్ భలే ఉందే అనుకున్నాను, మొదటిసారి ఈ బుక్‌ని వెంకట్ సిద్ధారెడ్డి గారి చేతిలో పోస్ట్‌లా చూసినప్పుడు. అందుకే ప్రిరిలీజ్ టైంలోనే ఆర్డర్ పెట్టాను. బుక్ వెంటనే అందినా చదవడానికి, మొదలుపెట్టడానికి నెలలు పట్టింది. నేను ఈ టైటిల్ చూసి, పిచ్చిగా ప్రేమించి, మోసపోయి భగ్న ప్రేమికుడు/ ప్రేమికురాలిగానో మిగిలిపోయిన వారి కథ చెప్తారనుకుంటే, వెరైటీగా భగ్నప్రేమికురాలిని ప్రేమ దారిలోకి తెచ్చిన కథ చెప్పారు. కథానాయకిలో పాజిటివిటీని పెంచే క్రమంలో, తనలో ప్రేమ పట్ల ఉన్న నెగెటివిటీని అంచెలంచెలుగా తెగగొట్టడం నాకు నచ్చింది. ప్రేమ మీద నమ్మకం కలిగించడానికి అడుగడుగునా బోలెడన్ని కథలు ఉన్నాయి, వాటిలో ఏదీ అతిగా అనిపించలేదు. సంభాషణలు చాలా సహజంగా, మనం ఎలా మాట్లాడుకుంటామో అలానే ఉన్నాయి. ఇది నేహ గారి మొదటి పుస్తకం అంటే ఆశ్చర్యం కలిగింది. తన గురించి తన ఇన్స్టా పేజీలో చూసి, మల్టై టాలెంటెడ్ పర్సన్, లిటరరీ ప్రపంచంలో కూడా అడుగుపెట్టినందుకు సంతోషంగా అనిపించింది. కొత్త రచయిత్రిని పరిచయం చేసినందుకు అన్వీక్షికి ధన్యవాదాలు. ఇంకా ఎంతో మంది ఔత్సాహిక రచయితలు, రచయిత్రులు వారి రచనలతో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. పాఠకులు ఓ మాట, మీరు ఫీల్‌గుడ్ స్టోరీస్ కోసం చూస్తున్నారు అంటే, మిమ్మల్ని ఏమాత్రం నిరుత్సాహపరచదు ఈ నవల. మరికొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి కూడాను. నేహా, నీ భవిష్యత్ రచనలకు ముందస్తు శుభాకాంక్షలు.  Thank you స్వప్న ప్రియ గారు. కంగ్రాట్స్ @chowdaryneha
#premaledanipremincharadani