పుస్తకాలు చాలామంది రాస్తారు, వాళ్ళలా అలవాటుగా మార్చుకోవాలనో ఒక వృత్తిలా మలుచుకోవాలనో లేదా కుటుంబంలో రచయితలు ఉండో ఈ మార్గాన్ని నేను ఎంచుకోలేదు.
మొదటిసారి కవిత్వం రాసినప్పుడు "దీన్ని కవిత్వం అంటారా" అని నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. అసలు నేనెందుకు రాసానో నాకే తెలియని రోజుల నుండి మొదలైన ప్రయాణం, ఎలా అయినా రాస్తునే ఉండాలి అని బలమైన నిర్ణయం తీసేసుకున్నాను అంటే ఒక రచన నన్ను ఎంత బలపరించిందో అర్థమైందనే అనుకుంటున్నాను. ఏదో పొట్టకూటి కోసమో, పేరు కోసమో, బలం కోసమో కాదు. నా మనసుని నేను ప్రశ్నించుకోవడానికి, బదులిచ్చుకోవడానికి, నా రాతలతో నేను బాధలు, ఆనందాలు, అద్భుతాలు ఇలా ఎన్నో పంచుకోవడానికి తోడ్పడుతూనే, ఎంతోమందికి తోడుగా, వాళ్ళ మనసుకి దగ్గరగా నిలుస్తూ ఉండటం వలనో ఏంటో, ఒక రకంగా చాలామంది మానసిక స్థితికి నా అక్షరాలు, మాటలు ధైర్యాన్ని ఇచ్చినట్టు అనిపించాయి. వాళ్ళతో ప్రయాణం చేస్తున్నట్టు అనిపించాయి.
అందుకే నేనేదో అందరి రచయితల్లా ఉండిపోకూడదు అనుకుంటూనే రాయడం ఆపకుండా, ఇంకెంతోమంది రాయించడానికి, రాసినవాళ్ళని రచయితలగా చెయ్యడానికి నా వంతు కృషి చేస్తూనే ఉన్నాను.
#krwritings
నీవెవరో తెలియనంత వరకు నాలా నేనే ఉన్నాను
తెలిసాక నీలో ఉండటం, నీతో ఉండటం మొదలుపెట్టాను
మన మొదలు ఎందాకో తెలియదు
ఎన్ని కథలు సృష్టిస్తుందో తెలియదు
ఎన్ని అనుభూతులు ఇస్తుందో తెలియదు
కానీ ఒక్కటైతే చెప్పగలను
ఆ ఒక్కటీ నువ్వే...
ఇదో ప్రయాణం
ఇదో ప్రమాణం
ఇదో ప్రణయం
ఇదో ప్రమోదం
ఇదో ప్రబంధం
❤️❤️ #vana - vani💝nani
Thanks for the beautiful photography ❤️
@sv_captures._@vidya_subramanyam
Thanks
@honeys_signature_closet@_honeymedishetty_
For the fabulous work ❤️❤️🥰 love you as always
Thanks for the makeover @santhimakeup
Celebrating chiranjeevi garu Birthday with my most celebrated moment 🤩🤩❤️❤️
Happy birthday annaayyaaaaaaa ❤️❤️
Without you telugu cinema is incomplete ❤️
ఒక రెండు మూడు తరాలకు సినిమా అంటే మీరే
డాన్స్ అంటే మీదే
స్టైల్ అంటే మీదే
కామెడీ టైమింగ్ అంటే మీదే
రికార్డ్స్ అంటే మీవే
మీకంటూ మెగా స్థానాన్ని పథిలంగా చెక్కుచెదిరిపోకుండా ఉంచుకున్నారు.
ఒక ఇంట్లో బిడ్డలా, ఎందరో గుండెల చప్పుడులా సుస్థిర స్థానం ఏర్పర్చుకున్నారు
ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఎంతోమందిలో వెలుగు నింపారు
ఒక మనిషికి ఇంతకుమించి ఏం కావాలి
మహానుభావుడు అనడానికి ఇంకేం కావాలి.
🙏🙏🙏🙏
జై చిరంజీవ
#krwritings #chiranjeevi #megastar #happybirthdaymegastar #chiranjeevibirthday
"Hidden Gem of srilanka"
Ambulwawa tower is really an amazing experience,
Those who really love Adventures go and experience it.
90% of the tourists scared about this 🤣
#vanacouple #travelcouple #ambulwawa #fearofheights #lolmoment
మీకు కూడా అనిపించిందా???
ఒకరు మనకి సహాయం చేస్తే, మనం తిరిగి ఏదైనా చెయ్యాలి లేదంటే ఋణపడిపోతాం అని మా పెద్దమ్మ చెప్పేది. కానీ ఇప్పుడు చాలా మంది జనం అలా లేరు, సాయం చేసేముందే ఆలోచించుకుంటున్నారు వీళ్ళతో ఫలానా అవసరం తీర్చుకోవాలి అని, వీళ్ళని ఫలానా పనులకు వాడుకోవాలి అని.
ప్రపంచం ముందుకెళ్తున్న కొద్దీ మనం కొన్నిసార్లు వెనుకబడిబోతున్నామేమో అనిపిస్తుంది.
#krwritings
అమ్మ కథలు చాలానే ఉంటాయి, ఎందుకంటే తను లేని చోటు అంటూ ఉండదు కదా, ఎక్కడ చూసినా ఏదో ఒక కథ పుడుతూనే ఉంటుంది.
అలాంటిదే ఈ కథ కూడా.
Happy Mother's Day.
నిజంగా కథ నచ్చితే ఓ నలుగురితో పంచుకోండి. 💐
#happymothersday
#krwritings
#krstories
#mothersday
#amma